టెన్త్ పేపర్ లీక్ కేసులో 11 మంది అరెస్ట్..నిందితులు వీళ్లే..

టెన్త్ పేపర్ లీక్ కేసులో 11 మంది అరెస్ట్..నిందితులు వీళ్లే..

నల్గొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి క్వశ్చన్  పేపర్ లీక్ కేసులో   పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.  ఇప్పటికే   ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడిని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు.. జడ్జి ఆదేశాల మేరకు ఆరుగురికి రిమాండ్ విధించి జైలుకు పంపించారు పోలీసులు.

మార్చి 21న  నకిరేకల్ గురుకులంలో టెన్త్  ఎగ్జామ్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఎగ్జామ్​ పేపర్​ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నకిరేకల్  ఎంఈవో నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్  కోడ్  ఆధారంగా నకిరేకల్​లోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. గోడ దూకి వచ్చిన వ్యక్తి పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రాన్ని సెల్​ఫోన్​లో ఫొటో తీసినట్లు విచారణలో తేల్చారు. 

ఎగ్జామ్​ సెంటర్​ సీఎస్​ గోపాల్, డిపార్ట్​మెంటల్  ఆఫీసర్  రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్  సుధారాణిని సస్పెండ్  చేశారు. స్టూడెంట్​ను డిబార్  చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రశ్నాపత్రం ఫొటోలను సోషల్  మీడియాలో వైరల్  చేసింది 11 మందిగా తేల్చి అరెస్ట్ చేశారు.