మెరుగైన జీపీఎస్ సర్వీస్ కోసం.. ఆరు శాటిలైట్లు నింగిలోకి

మెరుగైన జీపీఎస్ సర్వీస్ కోసం..  ఆరు శాటిలైట్లు నింగిలోకి

పౌరులకు క్లియర్ జీపీఎస్ సిస్టమ్‌ను అందించడానికి ఇస్రో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన పొజిషనింగ్ సిస్టమ్ ఇప్పటి వరకు వ్యూహాత్మక వినియోగానికి మాత్రమే పరిమితమైంది. భారతదేశ సొంత నావిగేషన్ సిస్టమ్‌ని సులభతరం చేయడానికి ఇస్రో కృషి చేస్తోందని స్పేస్ రెగ్యులేటర్ మరియు ప్రమోటర్ ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా అన్నారు. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు 2025 నాటికి 9 GSLV శాటిలైట్లతో సహా.. ప్రతి సంవత్సరం 12 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. 

కొత్త L1 బ్యాండ్‌తో 7 నావిగేషన్ ఉపగ్రహాలను పరిచయం చేశారు. ఇవి పౌరుల మొబైల్ ఫోన్‌లలో అనుకూలమైన చిప్‌సెట్‌తో NaVIC సిగ్నల్‌లను యాక్సెస్ చేయగలవు. ఏడింటిలో ఇప్పటికే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. మరో ఆరు ఉపగ్రహాలను త్వరలో ప్రయోగించనున్నారు. స్పేస్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని ఇండియన్ కంపెనీలకు ఇస్రో చీఫ్ పిలుపునిచ్చాడు. ప్రపంచంలోని ఇతర నావిగేషన్ సిస్టమ్‌ల కంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ చాలా ఖచ్చితమైనదని ఆయన అన్నారు. దాని ఇంకా పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. NaVIC భారతదేశం అంతటా 10 మీటర్ల కంటే ఎక్కువ క్లియర్ లోకేషన్ ను అందిస్తున్నామని గోయెంకా అన్నారు.