బంజారాహిల్స్లో ఆరు అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

బంజారాహిల్స్లో ఆరు అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్ లో అక్రమ నిర్మాలపై కొరడా ఝులిపిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన నిర్మించిన బిల్డింగ్ లను కూల్చివేస్తున్నారు. లేటెస్ట్ గా బంజారాహిల్స్  రోడ్ నెంబర్ 11 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్ ను కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 

స్టిల్ట్ + 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని సెల్లార్, గ్రౌండ్+ 6 ఫ్లోర్స్ నిర్మాణం చేపట్టారు అధికారులు.  ఈ  అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులకు   స్థానికులు ఫిర్యాదు చేశారు.  అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు స్థానికులు. కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 25న  అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు అధికారులు.

 ఇప్పటికే ఓ వైపు హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఫిర్యాదుల కోసం ఏకంగా ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసింది .ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. వీటి ఆధారంగా  పరిశీలించి అక్రమ నిర్మాణాలు అని తేలితే వాటిని కూల్చివేస్తోంది.