హుజూరాబాద్​ గురుకులంలో..ఆరుగురు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అస్వస్థత  

హుజురాబాద్   వెలుగు: హుజూరాబాద్ కేసీ క్యాంపులోని బీసీ బాలికల గురుకులంలో ఆరుగురు స్టూడెంట్స్​ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక  ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరికి తీవ్ర అస్వస్థత ఉండడంతో హనుమకొండ పంపించారు. అనంతరం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందిన నలుగురిని మంగళవారం ఉదయం వారి కుటుంబసభ్యులతో పంపించారు.

 

Also Read : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే : చంద్రశేఖర్

హనుమకొండలో చికిత్స పొందిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెడికల్​టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అనంతరం సాయంత్రం డిశ్చార్జ్​చేసినట్లు డాక్టర్లు తెలిపారు.  మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధిక, కమిషనర్​సమ్మయ్య, విద్యాశాఖ అధికారులు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కాగా విద్యార్థినుల్లో ఒకరికి ఆస్తమా ఉండగా ఆమె స్పృహ తప్పి పడిపోగా మిగతా విద్యార్థులు భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది.  దీనిపై ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా విషయాన్ని దాటవేసినట్లు సమాచారం.