ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనాతో ఇప్పటికే వేల మంది మరణించారు. తాజాగా అమెరికాలో ఆరువారాల శిశువు కరోనా సోకి మృతి చెందింది. ‘గత వారం చివరలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆరువారాల వయసులన్న శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ శిశువు వైద్యుల చికిత్సకు కోలుకోలేదు. దాంతో బుధవారం ఆ శిశువు చనిపోయింది’ అని కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామోంట్ తెలిపారు. నిన్న రాత్రి చేసిన పరీక్షల్లో శిశువుకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. కరోనా వల్ల చనిపోయిన కేసుల్లో ఈ కేసు అతి చిన్న వయసులో చనిపోయిన కేసుగా నమెదయినట్లు ఆయన తెలిపారు. గత వారంలో ఇల్లినాయిస్ లో కూడా తొమ్మిది నెలల వయస్సున్న శిశువు కరోనా వల్ల చనిపోయినట్లు ఆయన తెలిపారు.
కనెక్టికట్ స్టేట్ కు సరిహద్దుగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రం కరోనా వల్ల అతలాకుతలం అవుతుంది. మొత్తం అమెరికా మరణాలు 5,110 ఉంటే.. అందులో న్యూయార్క్ లోనే 2000 మంది దాకా మరణించారు. న్యూయార్క్, కనెక్టికట్ మరియు న్యూజెర్సీ రాష్ట్రాలలో దాదాపు ఒక లక్ష కేసులు నమోదయ్యాయి.
యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పటివరకు 2,15, 300 కేసులు నమోదుకాగా.. అందులో 201, 312 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 5,110 మంది చనిపోయారు. ఇకపోతే 8, 878 మంది రికవరీ అయినట్లు సమాచారం. ఈ రోజు కొత్తగా మరో 297 కేసులు నమోదుకాగా.. 8 మంది మరణించారు.
For More News..