శ్రీజయ ఫార్మా  కంపెనీలో గ్యాస్ లీక్ .. మల్కాపురంలో ఘటన  

  • ఆరుగురు కార్మికులకు అస్వస్థత

చౌటుప్పల్, వెలుగు :  యాదాద్రి భువనగిరిలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని శ్రీ జయ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మల్లెల రాంబాబు, వెంట్రీల లీల్, జే చిన్నబాబు, యల్లమల్ల శ్రీనివాస రావు, కుందూరి గిరిబాబు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, కండ్లు ఎర్రబడడం లాంటి సమస్యలతో బాధపడగా యాజమాన్యం వనస్థలిపురంలోని ప్రైవేట్​దవాఖానకు తరలించింది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్​స్పెక్టర్​ అశోక్ రెడ్డి తెలిపారు.