లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి మృతి : అపార్ట్మెంట్లో దారుణంపై ఉలిక్కిపడిన జనం

లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి మృతి : అపార్ట్మెంట్లో దారుణంపై ఉలిక్కిపడిన జనం

హైదరాబాద్ లో ఇల్లు అంటే లిఫ్ట్ లేకుండా ఊహించలేం.. ఇక అపార్ట్ మెంట్ అంటే లిఫ్ట్ కామన్. కాకపోతే ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది. లిఫ్ట్ మధ్య ఆగిపోతే ఇక అంతేనా.. లిఫ్ట్ లో చిక్కుకుంటే ఇక ప్రాణాలు పోవాల్సిందేనా.. హైదరాబాద్ సిటీలోని అపార్ట్ మెంట్స్ లో ఏర్పాటు చేస్తు్న్న లిఫ్టులపై పర్యవేక్షణ లేదా.. వాటి భద్రతను చెక్ చేసేది ఎవరు.. వాటి సేఫ్టీకి ఉన్న నిబంధనలు ఏంటీ ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది. కారణం.. ఆరేళ్ల చిన్నారి అర్నావ్.. లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చనిపోవటంతో అందరిలో ఇదే చర్చనీయాంశం అయ్యింది. 

అపార్ట్ మెంట్ లిఫ్టులో చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారి అర్నావ్.. నీలోఫర్ ఆస్పత్రికిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 24 గంటలపాటు డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేదు. లిఫ్టులో చిక్కుకున్న సమయంలో అర్నావ్ తీవ్రంగా గాయపడ్డాడని.. దీని వల్లే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయినట్లు చెబుతున్నారు. బ్రెయిన్ కు ఆక్సీజన్ అందకపోవటం.. గుండె దెబ్బతినటం వల్లే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ALSO READ | స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య.. టీచర్ వేధింపులే కారణం.. !

2025, ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌‌మాసబ్‌‌ట్యాంక్‌‌ శాంతి నగర్‌‌‌‌‌లో ఈ ఘటన జరిగింది. గోడే కబర్‌‌‌‌‌‌కు చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్నావ్ (6) తన తాతతో కలిసి శాంతినగర్ ‌‌‌‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లారు. లగేజీ తీసుకురావడానికి వెళ్లిన తన తాత రాకముందే.. పైకి అంతస్తుకు వెళ్లేందుకు ఆ బాలుడు లిఫ్ట్‌‌బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడు లిఫ్ట్‌‌‌‌‌డోరుకు, గోడకు మధ్యలో చిక్కుకుపోయాడు.

గమనించిన అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌వాసులు పోలీసులకు, హైడ్రా డీఆర్‌‌‌‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి లిఫ్ట్‌‌‌ గోడను పగులకొట్టి, గ్రిల్స్‌‌‌‌‌ను గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రెండు గంటల తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అధికారులు బాలుడిని నీలోఫర్‌‌‌‌‌ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు ఆరేళ్ల చిన్నారి అర్నావ్.