హైదరాబాద్ లో నీటి గుంతలు చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు బలవుతున్నాయి. ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ కళాసిగూడలోని నాలాలో మౌనిక అనే చిన్నారి మృతి చెందిన ఘటన అందరినీ కలచి వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే మరోకటి జరిగింది.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ చనిపోయాడు. ఆడుకుంటు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా దీస్తున్నారు. బతుకుదెరువు కోసం వివేక్ ఫ్యామిలీ ఏడేళ్ల క్రితం కాకినాడ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చింది. బాబు తండ్రి భీమా శంకర్ బంజారాహీల్స్ లోని ఓ బైక్ షోరూం వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
చిన్నారి మృతితో కుటుంబం సభ్యులు బోరున విలపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.