రెండో తరగతి చదువుతున్న బాలుడు అతి చిన్న వయసులోనే గిన్నిస్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నాడు. అహ్మదాబాద్‌కు చెందిన ఆరేళ్ల అర్హం ఓం తల్సానియా రెండో తరగతి చదువుతున్నాడు. అతడు మైక్రోసాఫ్ట్ నిర్వహించే సర్టిఫికేషన్ పరీక్షను క్లియర్ చేశాడు. ఆ పరీక్షలో బాలుడు పైథాన్ ప్రోగ్రామింగ్‌ను రాశాడు. దాంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నిలిచాడు.
‘నా తండ్రి నాకు కోడింగ్ నేర్పించారు. నేను రెండు సంవత్సరాల వయసు నుంచే టాబ్లెట్లను ఉపయోగించడం ప్రారంభించాను. మూడు సంవత్సరాల వయస్సులో iOS మరియు విండోస్‌తో నడిచే గాడ్జెట్‌లను వాడటం ప్రారంభించాను. నా తండ్రి పైథాన్‌లో పనిచేస్తున్నాడని నాకు ఆ తర్వాతే తెలిసింది. నాకు పైథాన్ నుంచి సర్టిఫికేట్ వచ్చేటప్పటికే నేను చిన్న చిన్న ఆటలను తయారుచేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ పరీక్షను క్లియర్ చేసిన తర్వాత కొంతకాలానికి ఏదైనా ప్రూఫ్ పంపమని గిన్నిస్ ప్రతినిధులు కోరారు. దాంతో నేను తయారు చేసిన గేమ్స్ పంపించాను. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధులు నా పరీక్షను ఆమోదించి.. నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ పంపించారు. నేను వ్యాపార వ్యవస్థాపకుడిగా మారి అవసరమైన వారందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. కోడింగ్ కోసం యాప్స్ మరియు గేమ్స్ తయారు చేయాలనుకుంటున్నాను’ అని అర్హం తెలిపాడు.
తన కుమారుడు కోడింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడని అందుకే ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ నేర్పించానని అర్హం తండ్రి ఓం తల్సానియా అన్నారు. ‘అర్హం చాలా చిన్న వయస్సు నుంచే గాడ్జెట్‌లపై చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అర్హం టాబ్లెట్‌లలో గేమ్స్ ఆడేవాడు. అతను పజిల్స్‌ను కూడా పరిష్కరించేవాడు. నేను కోడింగ్ చేసే సమయంలో అర్హం నా పక్కనే ఉండి చూసేవాడు. అలా అర్హంకు కోడింగ్ మీద ఆసక్తి కలిగింది’ అని ఓం తల్సానియా తెలిపారు.
For More News..