వామ్మో వెయ్యి సిక్సర్లే..!

ఐపీఎల్ అంటేనే సిక్స్లకు పెట్టింది పేరు. ఎలాంటి బౌలర్ అయినా సరే..బంతిని బలంగా బాదడమే లక్ష్యంగా బ్యాట్సమన్ చెలరేగుతుంటారు. హిట్టర్లయితే వాటర్ తాగినంత ఈజీగా సిక్స్లు కొడుతుంటారు. క్రీజులోకి వచ్చీ రాగానే బౌలర్పై సిక్సులతో విరుచుకుపడుతుంటారు. బ్యాట్సమన్ కొట్టే సిక్సులతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. 


 
ఐపీఎల్ 2022లో సిక్స్ల రికార్డు..
ఈ ఐపీఎల్లో బ్యాట్సమన్ సిక్సర్ల మోత మోగించారు. ఏ ఐపీఎల్ సాధ్యం కాని రికార్డును బ్యాట్సమన్ నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారిగా వెయ్యి సిక్సులు సంధించారు. హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్ కొట్టిన సిక్సర్తో ఈ ఐపీఎల్ వెయ్యి సిక్సర్లు పూర్తి చేసుకుంది. ఈ సీజన్లో  లివింగ్ స్టోన్ 117 మీటర్లు సిక్సర్ కొట్టగా.. ఇదే అతి పెద్ద సిక్స్ గా కొనసాగుతుంది.


గత సీజన్లలో ఎన్ని సిక్సర్లు..
ఇప్పటి వరకు 15 ఐపీఎల్  సీజన్లు జరిగాయి. ఇందులో 2018లో అత్యధికంగా 872 సిక్సులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అదే రికార్డు. 2019లో 784 సిక్సులు బాదారు. 2020లో 734 చెక్కాలు దంచి కొట్టారు. 2012లో 731 సిక్సర్లు నమోదయ్యాయి. 2009లో అత్యల్పంగా 506 సిక్సర్లు కొట్టారు.