కొలువుదీరిన టీసీఈ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ

కొలువుదీరిన టీసీఈ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ

హైదరాబాద్, వెలుగు: రీజనల్​ ఈవెంట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ చాంబర్​ ఆఫ్ ఈవెంట్స్ ఆరో వార్షికోత్సవం మంగళవారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సందర్భంగా నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ  కొలువుదీరింది. ఈ ఎన్నికలు ఇటీవల జరిగాయి.  ఇందులో నెగ్గిన కార్యవర్గాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి.  వీటిలో తెలంగాణ చాంబర్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), తెలంగాణ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ (టీఈఎఫ్ఏ)

 తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ (టీఈఎఫ్ఏ), తెలంగాణ సౌండ్ లైట్ వెండర్స్ అసోసియేషన్స్ (టీఎస్ఎల్వీఏ), తెలంగాణ ఈవెంట్ క్యాటరర్స్ అసోసియేషన్ (టీఈసీఏ), తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ (టీఈఎఫ్ఏ), తెలంగాణ ఎంటర్​టైనర్స్​ అసోసియేషన్ (టీఈఏ) ఉంటాయి.  ఈ అసోసియేషన్లలో 450 మందికి పైగా సభ్యులు ఉన్నారు.