కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. ఆరో తరగతి బాలికపై అత్యాచారం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో జనవరి 9న రాత్రి ఇంటి ముందు సైకిల్ తొక్కుతున్న బాలికను గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఓ టెంట్ హౌస్ దుకాణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక అరుపులతో పరారయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఫోక్సో కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.