గేమ్ చేంజర్​కు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పా: ఎస్ జే సూర్య

గేమ్ చేంజర్​కు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పా: ఎస్ జే సూర్య

దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రస్తుతం నటుడిగానూ డిఫరెంట్ రోల్స్‌‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు ఎస్‌‌జే సూర్య. వరుస సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తున్న ఆయన.. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో బొబ్బిలి మోపిదేవిగా మెప్పిస్తానంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా ఎస్‌‌జే సూర్య చెప్పిన విశేషాలు. 

‘‘శంకర్ గారితో పని చేయాలని ప్రతి ఆర్టిస్ట్‌‌కి ఉంటుంది. ‘గేమ్ చేంజర్’లో నటించాలని పిలిచినప్పుడే ఎక్సయిట్ అయ్యా.   ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే  స్క్రీన్ మీద మ్యాజిక్‌‌లా కనిపిస్తుంది.  నా ఫెర్మారెన్స్  చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఆయన క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది.ఇందులో నేను పొలిటీషియన్‌గా కనిపిస్తా. ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవి పాత్రలో కొత్తగా కనిపిస్తా.  రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌‌కు మంచి కిక్ ఇస్తాయి. ఓ నిజాయితీ గల  ఐఏఎస్ ఆఫీసర్‌‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌‌ను గేమ్ చేంజర్‌‌లో చూస్తారు.  సెట్‌‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. 

దర్శకుడికి ఏం కావాలి,  సీన్ ఎలా చేయాలి,  డైలాగ్ ఎలా చెప్పాలి అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది.  శంకర్ గారు నాకు ఇచ్చిన  పాత్రను  చాలా ఎంజాయ్ చేయడంతో.. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈజీగా డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పా.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌‌లో గొప్ప నటులు ఉన్నారు.  

ఇందులో  ఆయన డిఫరెంట్ షేడ్స్‌‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అలాగే ఆయన పోషించిన  అప్పన్న పాత్ర  లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది.  ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆల్ రౌండర్.  అన్ని క్రాఫ్ట్‌‌లను పరిశీలిస్తారు. ఇది పైసా వసూల్ సినిమా. ఇక  నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించడం లేదు’’.