ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni), మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda). అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.
Also Read : నీ మొగుడు వేస్ట్.. ప్రశాంత్ జోలికి వస్తే వదలం.. కన్నీళ్లు పెట్టుకున్న సందీప్ భార్య
The clock is ticking for this heart-pounding action flick ?? #Skanda will be streaming from 2nd Nov! #RaPoRampageonHotstar #DisneyPlusHotstar pic.twitter.com/r6l83G0Wo3
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 28, 2023
అయితే ఫస్ట్ వీక్ తరువాత స్కంద కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. తాజాగా స్కంద ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న డిస్నీ+హాట్‌స్టార్ లో నవంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఈ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి స్కంద సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో చాలా మంది ఈ సినిమాను థియేటర్ లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.