- రెండు రోజులు ప్రత్యేక పూజలు
పద్మారావు నగర్, వెలుగు: పద్మారావునగర్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని తమిళనాడులోని ధర్మపురం 27వ పరమాచార్య స్వామిజీ సందర్శించారు. ధర్మపురం స్వామిజీ స్కందగిరి ప్రధాన ఆలయం, గోపుర శిఖరం, సోలార్ ప్లాంట్, కంపోస్ట్ మిషన్ తదితర ప్రాంతాలను పరిశీలించి, వాటి విశిష్టత, శిల్పకళ, తదితర అంశాల గురించి దేవస్థాన మేనేజింగ్ట్రస్టీ కృష్ణన్రాజమణిని అడిగి తెలుసుకున్నారు. పీఠాధిపతి రెండు రోజుల పాటు స్కందగిరి క్షేత్రంలోనే ఉంటారని, సోమవారం కోటి దీపోత్సవం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ కృష్ణన్ రాజమణి, వెట్రి, కృష్ణ ప్రసాద్, వేద పాఠశాల విద్యార్థులు, రాంబాబు, బుగ్గయ్య, భక్తులు పాల్గొన్నారు.