గిన్నిస్ రికార్డు కోసం 2,600 కిలో మీటర్లు స్కేటింగ్

గిన్నిస్ రికార్డు కోసం 2,600 కిలో మీటర్లు స్కేటింగ్
  • ఆరోగ్య భారత్ నినాదంతో టీమ్ యాత్ర
  • సూర్యాపేటలో ఘన స్వాగతం పలికిన లయన్స్ క్లబ్

సూర్యాపేట, వెలుగు : గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం దేశవ్యాప్తంగా 10,550 కిలోమీటర్లు స్కేటింగ్ ద్వారా కాశీ నుంచి  2,600 కిలో మీటర్లు ప్రయాణించి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరారు స్కేటర్ సోను చౌరాసియా టీమ్. సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ స్కేటర్ సోను చౌరాసియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్కేటింగ్ చేస్తూ ఆరోగ్య భారత్ సందేశాన్ని తెలియజెప్పేందుకే యాత్ర  తీస్తున్నట్టు తెలిపారు. 

గత జనవరి 20న యూపీలోని కాశీలో యాత్రను ప్రారంభించామని చెప్పారు.  యూపీ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ స్కేటింగ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ద్వారా మే 12న కాశీకి చేరుకుంటామని వివరించారు. లయన్స్ క్లబ్ సభ్యులు గుండా లక్ష్మయ్య, ముద్ద సుధాకర్,  విశ్వహిందూ పరిషత్ నేతలు పర్వతం శ్రీధర్, మహేశ్వరం రవిచంద్ర, భువనగిరి సృజన్ ఉన్నారు.