హైదరాబాద్‌లో ట్రంకు పెట్టెలో ఓ అస్థిపంజరం బయటపడింది. ఎస్పీఆర్ హిల్స్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో బయటపడిన అస్థిపంజరం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ఫర్నిచర్ షాపులోని ఇనుపపెట్టెలో ఎముకల గూడుగా మారిన అస్థిపంజరం బయటపడింది. ఆ అస్థిపంజరం ఆనవాళ్లను బట్టి చూస్తే కొన్ని నెలల క్రితం చనిపోయినట్లుగా కనిపిస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఫర్నీచర్ షాపు యజమానిని విచారించనున్నారు. చనిపోయింది మహిళా లేక పురుషుడా అనే విషయం తెలియాలంటే కొంతసమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
For More News..