త్వరలోనే మంథనిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మారు మూల గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో సెంటిలియన్ సాఫ్ట్వేర్ కంపనీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
మంథని లాంటి గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉన్న విద్యార్థులు చాలా మంది ఉన్నారని అన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా సంకల్పమని, అందుకోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానమని స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గ ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందని, మంథని నుండి ప్రతి దేశంలో పని చేసే వారు ఉన్నారని గర్వంగా చెప్పారు.