స్కిల్లింగ్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలి

  • మేడ్చల్ కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ ఐటీఐ కాలేజీ ఆవరణలో నిర్మిస్తున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (స్కిల్లింగ్ సెంటర్) నిర్మాణ పనులను గడుపులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని బుధవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తవ్వడానికి  ఇంకా ఎంత సమయం పడుతుందని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలివేషన్, స్లాబ్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట చీఫ్ ఇంజినీర్ శ్యాంసుందర్, మేడ్చల్ తహసీల్దారు శైలజ, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎంపీడీఓ సంపూర్ణ, సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.