ములుగు, వెలుగు : ములుగు జిల్లా యువత నైపుణ్యాల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం స్కిల్డెవలప్ మెంట్సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ (టాస్క్) పేరిట ఈ సెంటర్అందుబాటులోకి రానున్నది. ఈ కేంద్రానికి తుది మెరుగులు దిద్దుతుండగా, డిసెంబర్చివరి నాటికి ప్రారంభించేలా కలెక్టర్దివాకర పనులు ముమ్మరం చేశారు.
ములుగు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని టాస్క్కేంద్రం ఏర్పాటుకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత యువతకు టాస్క్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నిలదొక్కుకునేందుకు తగిన శిక్షణ ఇవ్వనున్నారు. ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంచేందుకు టాస్క్సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్దివాకర సూచించారు.
23 లోపు దరఖాస్తు చేసుకోవాలి
ములుగులో ఏర్పాటు చేస్తున్న టాస్క్సెంటర్లో శిక్షణ పొందేందుకుగాను అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 23న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాని అధికారులు తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ తదితర కోర్సులు చదివిన 18 నుంచి 35 ఏండ్లలోపు అభ్యర్థులు ఈ నెల 23 సాయంత్రం 5గంటలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 88862 20324, 94403 48961 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.