గాంధీ సర్జరీ వింగ్లో స్కిల్​ ల్యాబ్ షురూ

గాంధీ సర్జరీ వింగ్లో స్కిల్​ ల్యాబ్ షురూ

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలోని జనరల్ సర్జరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ ను సోమవారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, గాంధీ మెడికల్​కాలేజీ  ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర ప్రారంభించారు. 

వైద్య విద్య అభ్యసిస్తున్న జనరల్ సర్జరీ విభాగంలోని పీజీ స్టూడెంట్స్​కు లాప్రోస్కోపీ చేయడానికి, ఆపరేషన్ తర్వాత కుట్లు వేయడానికి కావల్సిన స్కిల్స్​నేర్పించడంలో ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రాజారాం పాల్గొన్నారు.