- నవంబర్ 6 నుంచి పనులు ప్రారంభిస్తాం
- 8 నుంచి 10 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లు తయారు చేయించింది. నవంబర్ 6న పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఎనిమిది నుంచి పది నెలల్లోగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలోని యూనివర్సిటీ స్థలంలో పనులు చేపట్టనుంది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తో పాటు అకడమిక్ బ్లాక్, వర్క్ షాపులు, గర్ల్స్, బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ లు, డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వీటితో పాటు ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్ ఏరియా ఉండేలా ఈ డిజైన్లు రూపొందించారు.