- స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా
- స్కిల్ వర్సిటీ ఆలోచన గొప్పదని ప్రశంస
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పదని స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. సీఎం మంచి విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. అందుకే బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం కోరగానే ఒప్పుకున్నానని చెప్పారు. ‘‘సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ స్కీమ్‌లకు ప్రాధాన్యం ఇస్తాయి.
కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉంది. తెలంగా ణలో అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ ఉంది. ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబ డుతుందనడంలో సందేహం లేదు. సీఎం కల నిజమై ఆయన ఆశయం నెరవేరాలి” అని అన్నారు.