
న్యూఢిల్లీ: ఇండియాలో చెస్, బ్రిడ్జ్ వంటి స్కిల్ బేస్డ్ మైండ్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు గ్రాండ్‌మాస్టర్స్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్టు స్కిల్‌హబ్ ఆన్‌లైన్ గేమ్స్ ఫెడరేషన్ సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 18, 19వ తేదీల్లో బెంగళూరులో జరిగే సౌత్ జోన్ పోటీలతో తొలి ఎడిషన్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఆ తర్వాత ఇతర జోన్ పోటీలు కూడా జరుగుతాయని వెల్లడించింది. ఈ సిరీస్‌లో చెస్, అంధుల చెస్, బ్రిడ్జ్ గేమ్స్ ఉంటాయని తెలిపింది. జోన్ దశల తర్వాత వచ్చే ఏడాది మార్చిలో నేషనల్ సిరీస్ జరుగుతుందని, మూడు ఆటల్లో విన్నర్లకు మొత్తంగా రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుందని పేర్కొంది.