ఎల్లమ్మబండలో స్కిల్స్, లెర్నింగ్​ సెంటర్ ఓపెన్

ఎల్లమ్మబండలో స్కిల్స్, లెర్నింగ్​ సెంటర్ ఓపెన్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి మండలం ఎల్లమ్మబండలో ఏర్పాటు చేసిన అక్షయ విద్య కమ్యూనిటీ లెర్నింగ్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్‎ను గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ సోమవారం ప్రారంభించారు. ఆరో తరగతి వరకు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఉచితంగా చదువు చెప్పడం హర్షణీయమమన్నారు. ఇంటర్, డిగ్రీ స్టూడెంట్లతో పాఠాలు చెప్పించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా కలెక్టర్​గౌతమ్, అక్షయ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.