రాజ్ కోట్ లో టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా లో హాస్య సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇన్నింగ్స్ డిక్లేర్ అయిందని భావించి యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌లను గ్రౌండ్ లో నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపుగా వెళ్లడం ప్రారంభించారు. ఈ సమయంలో రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇద్దరిని వెనక్కి పంపించి బ్యాటింగ్ కొనసాగించాలని సూచించాడు. నిజానికి అప్పటికే రోహిత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయలేదు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నుంచే గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్ళమని సైగ చేశాడు.
అసలేం జరిగిందంటే
నాలుగో రోజు లంచ్ తర్వాత 97 ఓవర్లో గందరగోళం ఏర్పడింది. అప్పటికే జైస్వాల్ డబుల్ సెంచరీతో పాటు.. సర్ఫరాజ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇన్నింగ్స్ రోహిత్ భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడని భావించి తిరిగి స్టాండ్‌లోకి వెళ్లడం ప్రారంభించారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా వీరిని ఫాలో అయ్యారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ పట్టుకొని రోహిత్ వెళ్లి ఆడండి ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు అని చెప్పాడు. దీంతో భారత ఆటగాళ్లు ఇన్నింగ్స్ ను కొనసాగించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్క ఓవర్ రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
నాలుగు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో 434 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆదివారం ఇండియా ఇచ్చిన 557 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 122 స్కోరుకే కుప్పకూలింది. పదో నంబర్‌లో వచ్చిన మార్క్ వుడ్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థికి భారీ టార్గెట్‌ను ఇచ్చింది. వెన్నునొప్పి నుంచి కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వి జైస్వాల్ వరుసగా రెండో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.
శుభ్‌మన్ గిల్ (91) , సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది.
#INDvsENG #RohitSharma #YashasviJaiswal
— TOI Sports (@toisports) February 18, 2024
Declaration confusion! Rohit Sharma miffed after Yashasvi Jaiswal, Sarfaraz Khan walk back towards the stands
Watch: https://t.co/hUYlx4t2VR pic.twitter.com/RlYnchXVPK