ఉదయం టిఫిన్ తినకపోతే రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీద మనసు లాగుతుంది బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెదగే ప్రమాదం ఉంది.
Also Read :- కీసరగుట్ట కిటకిట..పోటెత్తిన భక్తులు..
ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే బ్రేక్ ఫాస్ట్ చేయనప్పుడు ఎక్కువగా నీళ్లు తాగటం కీరా, క్యారెట్ ముక్కలు వంటివి తినటం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పూ బాదం కిస్మిస్, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి వస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పనితీరు సన్నగిల్లుతుంది. పని మీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది. అలాగే పండ్లను నెలాన్స్ రూపంలో తీసుకుంటే మంచిది.