హైదరాబాద్, వెలుగు: ఐస్ పాప్సికిల్ బ్రాండ్ అయిన స్కిప్పీ ఐస్ పాప్స్ భారతదేశ మొట్టమొదటి ఈవీ ఫ్రీజర్ వెహికల్ ‘స్కిప్పీ ఫ్రీజర్ బైక్’ ను లాంచ్ చేసింది. ఫ్రీజర్తోపాటు ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమైజ్ చేశామని కంపెనీ తెలిపింది. రోజంతా బహిరంగ స్థలాల్లో ప్రజలకు ఐస్ పాప్స్ ను అమ్మేందుకు సోలో, మాస్టర్ ఫ్రాంచైజీ మోడల్ ను కూడా స్కిప్పీ ఆవిష్కరించింది.
స్కిప్పీ ఫ్రీజర్ బైక్స్ లాంచ్ సందర్భంగా స్కిప్పీ ఐస్ పాప్స్ కో–ఫౌండర్ రవి కాబ్రా మాట్లాడుతూ, ‘‘ఐస్పాప్స్ను పూర్తిగా సహజసిద్ధ పదార్థాలతో తయారు చేస్తున్నాం. కొన్నింట్లో పండ్ల రసాలను వాడుతున్నాం. మాకు శంషాబాద్‌లో యూనిట్ ఉంది. ప్రతి నెలా రూ.రెండు కోట్ల విలువైన టర్నోవర్ సాధిస్తున్నాం. ఫ్రీజర్ బైకు ధర రూ.2.5 లక్షలు. రాస్ప్ బెర్రీ, ఆరెంజ్, కోలా, మ్యాంగో ట్విస్ట్, బబుల్ గమ్, లెమన్ ఫ్లేవర్లలో మా ప్రొడక్టు అందుబాటులో ఉంటుంది. ఇది వరకే రూ.రెండు కోట్ల నిధులు సేకరించాం. మరోసారి తీసుకుంటాం”అని ఆయన వివరించారు. స్కిప్పీ ఐస్ పాప్స్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే 1500కు పైగా అవుట్ లెట్స్ లో లభ్యమవుతున్నాయి. భారత దేశవ్యాప్తంగా ఇది 8000 అవుట్ లెట్స్ లో అందుబాటులో ఉంది. 12 పాప్స్ ఉండే పేపర్ బాక్స్ ధర రూ.240 కాగా, 36 పాప్స్ ధర రూ.666. స్కిప్పీ ఐస్పాప్స్లో అశ్నీర్ గ్రోవర్ (భారత్ పే), అనుపమ్ మిత్తల్ (షాదీ.కామ్), అమన్ గుప్తా (బోట్), వినీతా సింగ్ (షుగర్ కాస్మటిక్స్), నమితా థాపర్ (ఎంక్యూర్ ఫార్మా), పీయూష్ బన్సల్ (లెన్స్ కార్ట్) పెట్టుబడులు ఉన్నాయి.