- జిల్లాలో మూడు టీంల ఏర్పాటు
- సంఘటన జరిగిన వెంటనే స్పీడ్‌గా రెస్పాండ్
- పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి
మెదక్, వెలుగు: ప్రకృతి విపత్తులు సంభవించి ప్రజలు అపాయంలో ఉన్నప్పుడు తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ఎస్పీ ఉదయ్ కుమార్ జిల్లాలో మూడు క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు ఇద్దరు ఏఎస్ఐలు ఇన్చార్జిగా ఉండగా, హెడ్ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులను మెంబర్లుగా నియమించారు. సంఘటన జరిగిన వెంటనే స్పీడ్‌గా రెస్పాండ్కావడం, పెద్ద ఎత్తున నిరసనలు జరగడం లేదా లా అండ్ఆర్డర్ కు విఘాతం కలిగిన పరిస్థితిలో సాయం అందించడం ఈ బృందాల పని.
జిల్లాను ఈ బృందాలు నిరంతర పర్యవేక్షిస్తుంటాయి. ప్రధానంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెడుతాయి. జిల్లాలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే స్పందించి అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తాయి.
ఏడుపాయల వద్ద అలర్ట్
సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ప్రాజెక్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గా ప్రాజెక్ట్(ఘనపూర్ఆనకట్ట) పై నుంచి నీరు పొంగి పొర్లుతుండడంతో భవానీ మాత ఆలయం చుట్టూ నీరు చేరింది. ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు, భక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ప్రమాదంలో పడితే రక్షించేందుకు వనదుర్గా ప్రాజెక్ట్, ఏడుపాయల ఆలయం వద్ద క్యూఆర్టీ టీంలను నియమించారు.
డీజీపీ ప్రశంస
ఆపత్కాలంలో ప్రజల ప్రాణ రక్షణ కోసం జిల్లాలో క్యూఆర్టీ టీంలను ఏర్పాటు చేయాడాన్ని డీజీపీ జితేందర్‌రెడ్డి అభినందించారు. ఇటీవల టేక్మాల్ మండలంలో వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన క్యూఆర్టీ పోలీసులను ఆయన మెచ్చుకున్నారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తిని రక్షించిన క్యూఆర్టీ మెంబర్మహేశ్ ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించి రివార్డు అందజేశారు.
Also Read :- బ్రిడ్జిలకు రిపేర్లు కరువు
కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన క్యూఆర్టీ పోలీసులు
ఇటీవల భారీ వర్షాలకు టేక్మాల్ మండల పరిధి గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన నంద్యా నాయక్ అనే యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. మధ్యలో ఓ బండరాయిని పట్టుకుని ఆగిపోయాడు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న క్విక్రియాక్షన్టీం సంఘటన స్థలానికి చేరుకుంది. టీం సభ్యులైన పోలీసులు తాడు సాయంతో రిస్క్‌చేసి నంద్యాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.