బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కై ఫోర్స్’. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. జనవరి 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 1965లోజరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్స్‌గా అక్షయ్ కుమార్, వీర్ పహరియా కనిపించిన తీరు ఆకట్టుకుంది.
భారత ఆర్మీ బేస్‌పై పాకిస్తాన్ సైన్యం దాడి చేయడంతో మొదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. పాక్ చేసిన దుశ్చర్యలను తిప్పికొట్టడానికి ఆపరేషన్ స్కై ఫోర్స్ పేరుతో ఓ యుద్ధాన్ని ప్రకటించడం క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో కనిపించారు.