- డిజైన్లు తయారు చేయించండి : సీఎం రేవంత్
- బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం
- గోల్కొండ చుట్టూ ఆక్రమణలు తొలగించాలి
- హైదరాబాద్- నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని ‘టూరిజం డెస్టినేషన్ సర్కిల్’గా అభివృద్ధి చేయాలనిసీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ నుంచి తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డుమీదుగా సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా రూపొందించాలని
ఇందుకోసం అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శుక్రవారం సెక్రటేరియెట్‌లో రివ్యూ చేసిన సీఎం.. దానికి కొనసాగింపుగా శనివారం హుస్సేన్‌సాగర్ టు నాగార్జున సాగర్ టూరిజం సర్క్యూట్‌పై అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.
(మొదటి పేజీ తరువాయి)
హైదరాబాద్ టూరిజానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న గోల్కొండ కోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రోడ్ల పక్కన ఆక్రమణలను తొలగించి, అక్కడున్న ఇండ్లు, దుకాణదారులకు మరో చోట పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకుకు సూచించారు.
హుస్సేన్‌సాగర్ టు నాగార్జున సాగర్
రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా స్టేట్‌లో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలన్నారు.
నిజానికి కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కి వ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియాన్ని ప్రభుత్వం ఈ ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహరించే ఏర్పాట్లు పునరుద్ధరించాలన్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మించాలన్న సీఎం.. రహదారికి ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.