SL vs AUS: సొంతగడ్డపై తేలిపోయిన లంకేయులు.. టెస్టులో అతి పెద్ద ఓటమి

SL vs AUS: సొంతగడ్డపై తేలిపోయిన లంకేయులు.. టెస్టులో అతి పెద్ద ఓటమి

శ్రీలంకతో జరుగుతోన్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్, 242 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలు 654 పరుగుల భారీ స్కోర్ చేయగా.. లంక బ్యాటర్లు రెండు సార్లు బ్యాటింగ్ చేసినప్పటికీ, లీడ్‌లోకి రాలేకపోయారు. సొంతగడ్డపై పర్యాటక జట్లను పరుగులు పెట్టించే లంకేయులు.. ఆస్ట్రేలియా జట్టు వంతు వచ్చేసరికి తేలిపోయారు. 

మ్యాచ్ ఏకపక్షం.. 

తొలి టెస్టులో ఆది నుంచే ఆస్ట్రేలియన్లదే పైచేయి. టాస్ గెలవడం దగ్గర నుంచి మొదలు పెడితే.. మ్యాచ్ ముగిసిన ఆఖరి బంతి వరకూ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మూడో రోజు ఆటలో వరుణుడు ప్రత్యక్షమై.. రోజును పూర్తిగా తడుచిపెట్టిసి ‘డ్రా’ చేసుకునే అవకాశం కల్పించినా.. లంక బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మాథ్యూ కుహ్నెమాన్(9 వికెట్లు), నాథన్ లియోన్(7 వికెట్లు) స్పిన్‌కు దాసోహమైపోయారు.

ALSO READ | Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్

ఇన్నింగ్స్, 247 పరుగుల తేడాతో ఓడిన లంకకు ఇది అతి పెద్ద ఓటమి. గతంలో 2017లో నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులో శ్రీలంక.. ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ రికార్డును ఆస్ట్రేలియా తుడిచి పెట్టేసింది. 

టెస్టుల్లో శ్రీలంక అతిపెద్ద ఓటములు

  • 1. ఇన్నింగ్స్, 242 పరుగుల తేడాతో (ఆస్ట్రేలియా  చేతిలో, 2025)
  • 2. ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో(టీమిండియా చేతిలో, 2017)
  • 3. ఇన్నింగ్స్, 229 పరుగుల తేడాతో (సౌతాఫ్రికా చేతిలో, 2001)

మ్యాచ్ స్కోర్లు

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 654/ 6 డిక్లేర్(ఖవాజా: 232, స్టీవ్ స్మిత్: 141, జోష్ ఇంగ్లిస్:102)
  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 165 ఆలౌట్ (చండిమాల్: 72)
  • శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 247 ఆలౌట్ (జెఫ్రీ వాండర్సే: 53)