వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఒక బ్యాటర్ ఇలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఏం జరిగిందంటే..?
శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ క్యాచ్ ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి రావాల్సిన మాథ్యూస్ సమయాన్ని వృథా చేస్తూ అలసత్వం వహించాడు. సరైన సమయానికి మైదానంలో అడుగుపెట్టినా.. హెల్మెట్ సమస్య వల్ల మరొకటి కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. వెంటనే కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి హెల్మెట్ అందించాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం బంగ్లా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఔట్‌పై వాదోపవాదనలు జరగవుతున్నాయి. అతనికి మరొక అవకాశం ఇవ్వాలా..? వద్దా? అనే దానిపై ఇరు జట్ల కోచ్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Angelo Mathews becomes the first player to be given out on 'timed out' in the history of cricket.??#BANvSL #SLvBAN #mathews pic.twitter.com/uWTzIG2EvB
— Abdullah TaYYab (@iamTayyab_56) November 6, 2023
నిబంధనలు ఏం చెప్తున్నాయి
ఐసీసీ నిబంధనలు ప్రకారం.. ఒక బ్యాటర్ ఔటవ్వగానే 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) మరొక బ్యాటర్ క్రీజులో ఉండాలి. లేనియెడల అంపైర్ ఔట్ గా ప్రకటిస్తారు.
Angelo Mathews leisurely walked out to the middle which took time, he had some issue with the helmet. He didn't reach the crease and called for another helmet.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023
- Bangladesh appealed for a time-out and the umpires followed the rules. pic.twitter.com/rrqtiIn2xX