వరుసగా నాలుగు ఓటముల అనంతరం న్యూజిలాండ్ జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ లంక 46.4 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌట్ అవ్వగా.. కివీస్ కేవలం 5 వికెట్లు కోల్పోయి మరో 160 బంతులు మిగిలివుండగానే చేధించింది.
173 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు సగానికి పైగా ఓవర్లు మిగిలివుండగానే చేధించారు. 23.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి నెట్ రన్‌రేట్ మెరుగు పరుచుకున్నారు. ఛేదనలో డెవాన్ కాన్వే(45), రచిన్ రవీంద్ర(42), డారిల్ మిచెల్(43) పరుగులతో రాణించారు.
ఆదుకున్న తీక్షణ
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. కుశాల్ పెరిరా(51) హాఫ్ సెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్ లో తీక్షణ(38) పర్వాలేదనిపించాడు. ఓ దశలో 129 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన లంకను తీక్షణ- మధుశంక జోడి ఆదుకున్నారు. చివరి వికెట్‌కు 43 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్, రవీంద్ర, శాంట్నర్‌లు రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
New Zealand cruise to victory against Sri Lanka and put one foot in the #CWC23 semi-finals!https://t.co/xEJ99EyR86 | #NZvSL | #CWC23 pic.twitter.com/bD1VqVt8Py
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2023
New Zealand have all but sealed a semi-final spot, with Pakistan and Afghanistan needing a miracle to overhaul their net run rate ?? #CWC23 pic.twitter.com/5rIqvmE7Wt
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2023