ఆక్లాండ్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న శ్రీలంక.. మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై ఊరట విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో పాథుమ్ నిశాంక (66), కుశాల్ మెండిస్ (54), జనిత్ లియానగే (53) చెలరేగడంతో.. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంక 140 రన్స్ భారీ తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. టాస్ నెగ్గిన లంక 50 ఓవర్లలో 290/8 స్కోరు చేసింది.
కుశాల్ మెండిస్ (46) మెరుగ్గా ఆడాడు. మ్యాట్ హెన్రీ 4, శాంట్నర్ 2వికెట్లు తీశారు. తర్వాత కివీస్ 29.4 ఓవర్లలో 150 రన్స్‌కే కుప్పకూలింది. మార్క్ చాప్‌మన్ (81) టాప్ స్కోరర్. అషిత ఫెర్నాండో (3/26), మహేశ్ తీక్షణ (3/35), ఇషాన్ మలింగ (3/35) దెబ్బకుకివీస్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.