క్రికెట్‌లో ఫన్నీ సంఘటనలు అరుదైనప్పటికీ.. పాక్ జట్టులో మాత్రం అవి ఎప్పుడూ చోటుచేసుకునేవే. వారు ఆడినా కామెడీయే.. వారు మాట్లాడినా కామెడీయే. అది నిజమే అని చెప్పటానికి ఈ ఒక్క సంఘటన చాలు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ పదకొండో నెంబర్ బ్యాటర్ అబ్రార్ అహ్మద్ ఓ ఫన్నీ సీన్ క్రియేట్ చేశారు. ఇతగాడు చేసిన పనికి ప్రేక్షకులే కాదు.. ఆటగాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు.
పాక్ తొలి ఇన్నింగ్స్ ఆఖరిలో లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ వేసిన బంతిని అబ్రార్ అహ్మద్ సరిగా అంచనా వేయలేకపోయాడు. ఆఫ్ స్పిన్ కావడంతో బంతి గిర్రున తిరుగుతూ.. అబ్రార్ గ్లవ్‌ను తాకి అతని ప్యాడ్‌లో ఇరుక్కుంది. అది చూసిన లంక వికెట్ కీపర్ సమరవిక్రమ.. బంతిని తీసుకునేందుకు అతనివైపు వచ్చాడు. అయితే అబ్రార్ అతనికి ఆ అవకాశం ఇవ్వడు.
చేతికి గ్లోవ్స్ ఉండటంతో బంతిని కింద వేయడానికి అబ్రార్‌కు కుదరదు. పోనీ కీపర్‌ను తీసుకోనిద్దామా! అంటే క్యాచ్ ఔట్‌కు అప్పీల్ చేస్తాడేమేమోనన్న భయం. అతని నుండి తప్పించుకోవడానికి అబ్రార్.. క్రీజు వదలి బయటకు వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు తోసుకోవడంతో కాసేపటి తరువాత బంతి కింద పడుతుంది. వెంటనే బాల్ చేతికందుకున్న సమరవిక్రమ.. త్రో వేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సీన్ చూసి ప్రేక్షుకులు, ఆటగాళ్లు కడుపుబ్బా నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Abrar Ahmed & Sadeera Rashen Samarawickrama shared an instance that gave fans a reason to laugh out loud ?
— Sony Sports Network (@SonySportsNetwk) July 18, 2023
How much more exciting will this #SLvPAK series get? ?#SonySportsNetwork pic.twitter.com/4w2ihvT1YR