
ఎస్ఎస్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటికి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. 22 రోజులుగా ( మార్చి 15నాటికి ) రెస్క్యూ టీం డేంజర్ జోన్లో గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. టీజీఎం కట్టర్మిషన్ కు ప్లాస్మా కట్టర్లను బిగించి ప్రక్రియ ప్రారంభించారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందుకు డేంజర్ జోన్ ఉన్నట్లు గుర్తించారు.
ఎస్ఎస్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకి తెలుసుకునేందుకు రోబోలను కూడా ఉపయోగిస్తారు. రోబోలకు ప్రత్యేక యంత్రాలను అనుసంధానం చేసి డేంజర్ జోన్ లో ఆపరేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎండ్ పాయింట్లో డేంజర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లిక్విడ్ రింగ్ వ్యాక్యేమ్ తో సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే సిబ్బందికి డేంజర్ జోన్ లోనికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డీ-2 వద్ద తవ్వకాలను అధునాతన యంత్రాలతో కొనసాగుతున్నాయి.
Also Read : డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన రెస్క్యూ టీమ్స్
సింగరేణి రెస్క్యూ బృందాలు, ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, అన్వి రోబోటిక్స్, కేరళ కాడవర్ డాగ్స్, ఆర్మీతో కూడిన సహాయక బృందాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి.మూడు చోట్ల పైకప్పు కూలకుండా టైగర్ కాగ్స్ను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా డీ-వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.