నిజాలను దాచకుండా బయట పెట్టండి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నిజాలను దాచకుండా బయట పెట్టండి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  •   పనులు వద్దని నివేదికలు  
  •  కమిషన్ల కోసమే చేసిండ్రు 
  •  ఘటనపై  హైకోర్టు జడ్జితో విచారణ చేయండి 

హైదరాబాద్:  ఎస్ఎల్​బీసీ  టన్నెల్​లో  ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచిందని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆరోపించారు. ఎస్‌ఎబీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ‘  కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయింది.  

టన్నెల్​ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించింది.  నివేదికల్లో చెప్పిన తీరుగా ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది.  8 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.  

ALSO READ | SLBC టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు కేడావర్ డాగ్స్

అదేవిధంగా వేలకోట్ల ప్రజాధనం వృధా అయింది.  సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మొత్తం క్యాబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి.  ఈ రెండు నివేదికల అంశంపైన ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి.  ఈ  ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని, ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల తరఫున ఈ అంశంపై పూర్తి వివరాలు విడుదల చేసి ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలి’ అని కేటీఆర్​ ట్వీట్​చేశారు.