SLBC : నెల దాటినా దొరకని ఏడుగురి మృతదేహాలు

SLBC :  నెల దాటినా దొరకని ఏడుగురి మృతదేహాలు

నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో 8 మంది చిక్కుకుని నెల రోజులు గడిచినా ఆచూకీ లభించడం లేదు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం బయటపడింది. ఇంకా ఏడుగురి మృతదేహాల కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో సిబ్బంది   నెలరోజులుగా శథవిథాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కల్గకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది.  ఎన్డీఆర్ఎఫ్, ఎడీఆర్ఫ్, ఆర్మీ వంటి విభాగాలతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్  దగ్గర  ఫిబ్రవరి 22  ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే  మరో  ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్  మృతదేహాన్ని బయటకు తీశారు అధికారులు. ఇంకా ఏడుగురు మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

ఇంకా బయటకు రాని మృతదేహాలు వీళ్లవే

మనోజ్ కుమార్(యూపీ)
శ్రీనివాస్(యూపీ)
సందీప్ సాహు (జార్ఖండ్)
జగత్ (జార్ఖండ్)
సంతోష్ సాహు (జార్ఖండ్)
అంజు సాహు(జార్ఖండ్)
సన్నీ సింగ్(జమ్మూకశ్మీర్)