
ఎస్ఎల్ బీసీ టెన్నల్ లో చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజులుగా నాన్ స్టాప్ గా సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులు. ఇప్పటికే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా,ఫైర్ టీమ్స్ సహాయక చర్యలు చేపడుతుండగా..ఇవాళ నేవీ అధికారులు రంగంలోకి దిగారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం 300 మంది పాలుపంచుకుంటున్నారు. వీరిలో ఆర్మీ నుంచి 35 మంది, ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి 120 మంది, ఎస్డీఆర్‌ఎఫ్ నుంచి 45 మంది, హైడ్రా నుంచి 24 మంది, సింగరేణి నుంచి 24 మంది, ఫైర్ డిజాస్టర్ టీమ్ నుంచి మరికొంత మంది ఉన్నారు.
టన్నెలో లోపలికి 13.8 కి.మీ వరకు వెళ్లిన రెస్కూ టీమ్స్ ..ఇంకో 200 మీటర్లు వెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఎందుకంటే 2 నుంచి 3 మీటర్ల ఎత్తు శిథిలాలు, బురద మట్టి పేరుకుపోయింది. లోపల ఆక్సిజన్ పైపు కూడా పగిలిపోయింది. నిరంతరం నీళ్లు ఉబికి రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గుతోంది. మరో వైపు ఈ ఘటనపై టన్నెల్ దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్, జూపల్లి. మరో వైపు మంత్రులను వివరాలు అడిగి ఘటన గురించి ఆరాదీస్తున్నారు సీఎం రేవంత్.
Also Read : సుంకిశాల, ఎస్ఎల్బీసీ పైవిచారణ జరిపించాలి
శిథిలాల కింద చిక్కుకున్నరా..?
ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషిన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడి, నీళ్లు లోపలికి వస్తుండడంతో వాళ్లంతా టీబీఎం మిషిన్‌లో తలదాచుకొని ఉండొచ్చని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి చూడగా, ఆ మిషిన్ మొత్తం శిథిలమైపోయింది. ప్రమాద ధాటికి దాదాపు 90 మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికితోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు.
ఫిబ్రవరి 23 అర్ధరాత్రి 2 గంటలకు టన్నెల్‌లోకి వెళ్లిన ఫైర్ డిజాస్టర్ టీమ్.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికులను పేర్లు పెట్టి గట్టిగా పిలిచింది. ‘మనోజ్ త్రివేది.. శ్రీనివాస్.. హమారా వాయిస్ ఆప్ సున్ రహే క్యా’ అంటూ అరిచింది. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతున్నది.