
- గుర్తించిన జల వనరుల శాఖ
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ఊట నీరు తగ్గడం లేదు. గంటకు దాదాపు ఐదారు వేల లీటర్ల ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఊట నీరు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించేందుకు ఆదివారం భూగర్భ జల వనరుల శాఖ ఆఫీసర్లు టన్నెల్ పై భాగంలోని 14వ కిలోమీటర్ వద్ద ఫారెస్ట్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
మల్లెలతీర్థం, తాటి గుండాల, ఉసురువాగు, మల్లెవాగు ప్రాంతాల నుంచి నీరు రావడాన్ని గమనించారు. ఈ వాగుల ప్రవాహం వల్లే టన్నెల్‌లోకి ఊట నీరు చేరుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదిక సిద్ధం చేస్తున్నారు. కాగా.. ఆదివారం టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగాయి. శనివారం మధ్యాహ్నం టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం దాదాపు 11 గంటల పాటు మట్టి, రాళ్లు శిథిలాలను తొలగించాయి.