శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై విధించిన నిషేధాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సి) ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో అతడు నిర్దోషిగా తేలడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సమయంలో గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదయ్యింది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళ.. తనను గుణతిలక బలవంతంగా అనుభవించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నా.. ఆమె సమ్మతి లేకుండా కండోమ్‌ను తీసివేశాడనేది అతనిపై ఉన్న అభియోగం. ఈ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో.. లంక క్రికెట్ బోర్డు అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. \
ALSO READ : మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణ 8 వారాలకు వాయిదా
తాజాగా ఈ కేసులో న్యూ సౌత్ వేల్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి కండోమ్ చెక్కుచెదరకుండా ఉన్నందున గుణతిలక దానిని తొలగించడం అసాధ్యమని డిస్ట్రిక్ట్ కోర్ట్ తన తీర్పులో పేర్కొంది. దీంతో లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడ్డ దనుష్క గుణతిలకపై విధించిన నిషేధాన్ని లంక క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. అతడిని జాతీయ జట్టులోకి మళ్లీ తీసుకుంటున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Sri Lanka Cricket (SLC) wishes to announce that the Independent Inquiry Committee appointed by SLC, which was tasked with investigating into the impact of the criminal allegations against Mr. Danishka Gunathilaka in Australia, has recommended a full lifting of the ban imposed on…
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 17, 2023