ఎస్సారెస్పీలోకి స్వల్ప వరద  ..  9.90 టీఎంసీలకు చేరిక 

ఎస్సారెస్పీలోకి స్వల్ప వరద  ..  9.90 టీఎంసీలకు చేరిక 

బాల్కొండ, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈ రవి తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,472 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం1091.00 అడుగులు(80.5టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రానికి 1059.30 అడుగులు (9.90 టీఎంసీలు)గా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1064.90 అడుగులు (15.88 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.