దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర మంగళవారం రూ.55,250 ఉండగా రూ.150 పెరిగి రూ. 55,400కి చేరింది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 పెరిగి, రూ. 5,54,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,540గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 160 పెరిగి.. రూ. 60,440 కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 60,280గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,04,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,040గా ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,550గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,570గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,440గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా ఉంది. అహ్మదాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,400గాను, 24 క్యారెట్ల పసిడి రూ. 60,440గాను ఉంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,450గా ఉంది.