- జారిపడి వ్యక్తి మృతి
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తడికలపూడి రైల్వేస్టేషన్ లో ట్రైన్ ఎక్కుతూ జారిపడి ఓ వ్యక్తి చనిపోయాడు. పాల్వంచకు చెందిన బీమల్ ధన్సింగ్(60) తన మనవరాలు సాహితీతో కలిసి నెక్కొండ సమీపంలోని అన్నారానికి బయలుదేరారు.
ఈ క్రమంలో వీరిద్దరూ కొత్తగూడెంలో రైలు ఎక్కారు. కాగా తడికలపూడి రైల్వేస్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఆపారు. ఆ సమయంలో కిందికి దిగిన ధన్సింగ్ తిరిగి ట్రైన్ ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ:ఒకే గదిలో ఆడ - మగ భారత షూటర్ల పార్టీ.. కొరియాలో రచ్చ రంబోలా!