భద్రాచలం, వెలుగు : హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్లాన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్-లో జిల్లాకు చెందిన బానోత్ ధనుశ్రీ 15 సంవత్సరాల విభాగంలో థర్డ్ ప్లేస్ సాధించింది. ధనుశ్రీ భద్రాచలం గిరిజన గురుకులం కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో ఎంపీపీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
రూ.8 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్, ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్ స్థాయి టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన ధనుశ్రీని ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్, గురుకులాల ఆర్సీవో డేవిడ్రాజ్లు అభినందించారు.