భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్‌‌ సేవలు షురూ

భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్‌‌ సేవలు షురూ
  •  పైలట్​ ప్రాజెక్ట్‌‌ గా రామగుండం, జగిత్యాల 
  • సబ్ ​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో అమలు

గోదావరిఖని/జగిత్యాల, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి వేచి చూడకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పైలట్‌‌ ప్రాజెక్టుగా అమలుచేయనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం, జగిత్యాల సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో గురువారం నుంచి ప్రయోగత్మకంగా సేవలు ప్రారంభమయ్యాయి.

జగిత్యాల సబ్ రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీసును స్లాట్ బుకింగ్​విధానాన్ని డిప్యూటీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రవీందర్ పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సబ్​రిజిస్ట్రార్​పి.సుజాత ఉన్నారు. రామగుండలో గురువారం 12 మందికి భూమి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తయి డ్యాక్యూమెంట్లను అందజేసినట్టు జిల్లా రిజిస్ట్రార్​ ప్రవీణ్​కుమార్​, సబ్​రిజిస్ట్రార్​ బాలకిషన్​ తెలిపారు. ప్రజలు నేరుగా registration. telangana.gov.in లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని చెప్పారు.