బీఆర్ఎస్ లో హరీశ్​ స్థానం ఏంటి .. కేసీఆర్​ వారసుడినంటూ పగటి కలలు: ఎంపీ చామల

బీఆర్ఎస్ లో హరీశ్​ స్థానం ఏంటి .. కేసీఆర్​ వారసుడినంటూ పగటి కలలు: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​లో హరీశ్​ రావు స్థానం ఏంటో ఆయనకే తెలియదని, కానీ హరీశ్​మాత్రం కేసీఆర్​కు వారసుడినంటూ పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే కేసీఆర్ అని, పడిపోయిన తెలంగాణను నిలబెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

 బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటించిన ఆ పార్టీ పోస్టర్లలో హరీశ్​ రావు ఫొటో ఎక్కడా లేదని, కేటీఆర్ బీఆర్ఎస్​లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హరీశ్​​ రాజకీయ కల చెదిరిపోయిందని అన్నారు. రాష్ట్రంలో బూతు పితామహుడు కేసీఆర్ అని, కండ్లు ఉండి చూడలేని కబోది హరీశ్​ రావు అని మండిపడ్డారు. బీసీని కాంగ్రెస్​ పార్టీ పీసీసీ చీఫ్ గా నియమించిందని, బీఆర్ఎస్  ప్రెసిడెంట్​గానైనా, వర్కింగ్  ప్రెసిడెంట్​గానైనా బీసీని నియమించగలరా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కొందరికి కూలీ ఇచ్చి కంచె గచ్చిబౌలిపై తప్పుడు బొమ్మలు వేయించాడని ధ్వజమెత్తారు.