
హైదరాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్తు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ వెల్లడించారు. అది ఎవరిపైనైనా దాడిచేసినప్పుడు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. దాని మృతదేహంపై వివిధ భాగాల్లో గాయాలున్నాయని చెప్పారు.