న్యూఢిల్లీ: మనదేశంలో ఎనిమిది కీలక మౌలిక సదుపాయాల రంగాల ఉత్పత్తి వృద్ధి 2024 నవంబర్‌లో 4.3 శాతానికి తగ్గింది. అంతకుముందు సంవత్సరం నవంబర్‌లో ఇది7.9 శాతం వృద్ధి చెందింది. నెలవారీ ప్రాతిపదికన, ఈ రంగాల ఉత్పత్తి వృద్ధి అక్టోబర్ 2024లో నమోదైన 3.7 శాతం వృద్ధి కంటే ఎక్కువగా ఉంది.
నవంబర్‌లో ముడి చమురు, సహజవాయువు ఉత్పత్తి తగ్గింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, కరెంటు ఉత్పత్తి వృద్ధి వరుసగా 7.5 శాతం, 2.9 శాతం, 2 శాతం, 4.8 శాతం 3.8 శాతం తగ్గింది. అయితే సిమెంట్ ఉత్పత్తి 13 శాతానికి పెరిగింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ప్రధాన రంగాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–నవంబర్ మధ్యకాలంలో 4.2 శాతంగా ఉందని ప్రభుత్వ డేటా వెల్లడించింది.